హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... కుమారుడు, కోడలుపై చేసిన న్యాయపోరాటంలో వృద్ధదంపతులు గెలిచారు. తమ ఇంటి నుంచి తరిమేసి వేధిస్తున్నారని వీరిద్దరూ గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కలెక్టర్.... ఇంటిని వాళ్లకు తిరిగి అప్పగించాలని ఆదేశించారు. వృద్ధులతో సహా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంటికి చేరుకునేసరికి... తాళం వేసి ఉండటాన్ని గమనించారు. వృద్ధ దంపతులిద్దరూ అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు.